News August 23, 2025

పోలీస్ నుంచి టీచర్‌గా..

image

మెగా డీఎస్సీ ఫలితాల్లో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మం. జూటూరుకు చెందిన వసుంధర సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 59వ ర్యాంకుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి (SGT)గా ఎంపికయ్యారు. అయితే వసుంధర ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో పనిచేశారు. ప్రజల రక్షణలో కీలకంగా పనిచేస్తూ లక్ష్యాన్ని మరవకుండా టీచర్ జాబ్ సాధించారు.

Similar News

News August 23, 2025

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం భూమిని సిద్ధంగా పెట్టుకోవాలి: కలెక్టర్

image

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ పరిధిలో అనంతపురం -తాడిపత్రి జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1,390లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

News August 23, 2025

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా సందిరెడ్డి శ్రీనివాసులు

image

బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. శ్రీనివాసులు 1985లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చేరి కళాశాల కార్యదర్శిగా పనిచేశారు. 1990లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం బీజేపీలో చేరారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా 2సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

News August 23, 2025

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు మీ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద సరిపడ స్టాక్ ఉందన్నారు. గ్రామ, మండల వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు.