News August 23, 2025

తాడ్వాయి: కనుమరుగైన మంచెలు

image

వ్యవసాయ బావుల వద్ద మంచెలు కనుమరుగయ్యాయి. గత 20 ఏళ్ల క్రితం వ్యవసాయ బావుల వద్ద రైతులు కట్టెలతో మంచెలు వేసుకొని సాగుచేసిన పంటలకు కాపలా కాసేవారు. అంతేకాకుండా క్రిమి కీటకాల నుంచి రక్షణగా మంచెలు ఉండేవి. కాపలా అనంతరం మంచెపై కూర్చుని భోజనం చేసి రైతులు సేద తీరేవారు. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు రైతులకు వ్యవసాయ బావుల వద్ద లేకుండా పోయింది. మంచెల గురించి పలువురు రైతులు గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు.

Similar News

News March 5, 2026

LLB పరీక్షకు హాజరైన నందిగామ ఎమ్మెల్యే

image

గుంటూరు జెసి కాలేజ్ ఆఫ్ లా కళాశాలలో మొదటి సంవత్సరం LLB పరీక్షలకు గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. అనంతరం విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. ఒక పక్కన శాసన సభ్యురాలుగా కొనసాగుతూనే, మరొక పక్క చదువులో రాణిస్తున్నారు. LLB చదివి లాయర్ అవ్వాలన్నది వాళ్ల నాన్నగారికి ఇష్టమని ఆమె తెలిపారు.

News March 5, 2026

రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.

News March 5, 2026

గన్నవరం: మంత్రి, MLAలు ఉన్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం

image

గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో సమస్యను పైలట్ గుర్తించి వెంటనే రన్‌వేపై విమానాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రత్తిపాటి పుల్లరావు, నేత కన్నా లక్ష్మీనారాయణ సహా 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ రద్దు కావడంతో ప్రయాణికులు రోడ్డు మార్గంలో బయలుదేరారు.