News August 23, 2025

మొదటి రోజు UPSC పరీక్ష.. 3% మంది గైర్హాజరు

image

నగరంలో నిన్న ప్రారంభమైన UPSC మెయిన్స్‌కు 3% మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. బ్లాక్- Aలో 576 మందికి 560 మంది, బ్లాక్ -Bలో 114 మంది రావాల్సి ఉండగా 109 మంది పరీక్ష రాశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. ఇందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వివరించారు.

Similar News

News September 12, 2025

HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

image

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్‌&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.

News September 12, 2025

GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

News September 12, 2025

గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.