News August 23, 2025

అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

image

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆర్.కామ్, అంబానీతో సంబంధం ఉన్న చోట్ల సోదాలు చేస్తోంది. ఇటీవల ఈడీ కూడా ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆ తర్వాత విచారించిన సంగతి తెలిసిందే.

Similar News

News August 23, 2025

రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఆగస్టు25 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

News August 23, 2025

అర్చకులు, ఈవోల‌కు ప‌దోన్న‌తులు

image

TG: దేవదాయ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు ప‌దోన్న‌తులు లభించాయి. ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు మంత్రి కొండా సురేఖ ఆర్డ‌ర్ కాపీల‌ను స‌చివాల‌యంలో అంద‌జేశారు. దేవదాయ శాఖ‌లో పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచ‌డానికి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి సురేఖ కృషి చేశారని అర్చకుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

News August 23, 2025

అఖిల్ ఒక్క రూపాయి తీసుకోలేదు: అనిల్ సుంకర

image

తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్‌గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మూవీస్ ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే, ఏజెంట్ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్‌లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.