News April 2, 2024

అస్సాం CSగా తెలుగు వ్యక్తి

image

APలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి(M) కోటపాడుకు చెందిన రవి కోత అస్సాం CSగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1993వ బ్యాచ్ అస్సాం-మేఘాలయ కేడర్‌ IAS అధికారి. అస్సాం CS బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. 1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఆగ్రానమిలో PhD గోల్డ్ మెడల్ అందుకున్నారు.

Similar News

News October 7, 2024

ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ

image

TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్‌తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News October 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:00 గంటలకు
ఇష: రాత్రి 7.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 7, 2024

మయాంక్ యాదవ్ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ యాదవ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించారు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. గతంలో 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్‌పై అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.