News August 23, 2025
NTR: గణేశ్ ఉత్సవాలకు మండపం పెడుతున్నారా.. ఇది మీ కోసమే

ఎన్టీఆర్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో ద్వారా సులభంగా అనుమతి పొందవచ్చని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. https://ganeshutsav.net/ వెబ్‌సైట్‌లో మండపం నిర్వహించేవారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం తేదీ, వాహన వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని సీపీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
బాపట్ల: ‘గ్యాస్ కొరత’ కట్టెల పొయ్యిలే దిక్కు..!

యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. వంట గ్యాస్ దొరకకపోవడంతో జిల్లాలో పలు హోటల్స్, టీ స్టాళ్లు, బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిలతో ఇబ్బందుల వల్ల వ్యాపారాలు చేయలేక దుకాణాలను మూయాల్సి వస్తోందంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్ కష్టాలతో పాటు పెట్రోల్ కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
News March 23, 2026
నిజామాబాద్: వరి ధాన్యం సేకరణకు అడుగులు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యాసంగి వరి ధాన్యం సేకరణకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 800కు పైగా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బోనస్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులు ఇబ్బంది పడకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను ముందస్తుగా సమకూర్చుకుంటున్నారు.