News August 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
☛ సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ
☛ ‘హైడ్రా’ ఒకట్రెండు ఏళ్లకు పరిమితం కాదు.. వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది: కమిషనర్ రంగనాథ్
☛ నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Similar News
News August 23, 2025
యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలి’ అని తెలిపారు.
News August 23, 2025
రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.
News August 23, 2025
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.