News August 23, 2025

HYDలో గుంతల చింతలు తీరేనా!

image

మహానగర రోడ్లపై గుంతలు ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. గుంతల రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అందుకే గుంతలను సాధ్యమైనంత త్వరగా పూడ్చేలా GHMC చర్యలు తీసుకుంటోంది. మహానగరంలో 12,696 గుంతలున్నాయని గమనించింది. కొద్ది రోజులుగా మరమ్మతులూ ప్రారంభించింది. ఇప్పటి వరకు 9,899 గుంతలను పూడ్చినట్లు GHMC ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 8, 2026

ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

image

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.

News March 8, 2026

NLG: కొత్త వాహనాలపై రహదారి భద్రతా సెస్

image

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై రహదారి భద్రతా సెస్ అమల్లోకి వచ్చింది. ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు, తేలికపాటి వాహనాలకు రూ.5వేలు, కార్లు, ఇతర రవాణేతర వాహనాలకు రూ.10వేల వరకు సెస్ వసూలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే వాహనాలపై 4% నుంచి 65% వరకు పన్ను విధించనున్నారు. దీంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.