News August 23, 2025

కంటిచూపు కోల్పోయిన హోంగార్డుకి సీపీ సాయం

image

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్‌కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.

Similar News

News August 23, 2025

KNR:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

image

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్, ఆర్ అండ్ బీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నూరు శాతం పూర్తి చేయాలని, గృహప్రవేశాలకు సిద్ధం చేసేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

News August 23, 2025

KNR: ‘శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి’

image

KNR పోలీస్ కమిషనరేట్‌లో మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీల పెద్దలతో పోలీసు కమిషనర్ గౌష్ ఆలం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. పండుగలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

News August 23, 2025

ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శించిన మంత్రి వివేక్

image

మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఆయన చిత్రపటానికి కార్మిక & బొగ్గుగనుల శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను, మృతుడు రాజేశం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపర్చారు.