News August 23, 2025
సిద్దిపేట: లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం!

లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు జిల్లాలో వినవస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న మేస్త్రి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన సిద్దిపేట హౌసింగ్ ఏఈ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇంకొందరు అవినీతిపరులు ఉన్నారని వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News August 23, 2025
ASF: ఈనెల 25 వరకు ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తులు

ఆసిఫాబాద్ జిల్లాలోని 41 పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ దీపక్ తివారి తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 25లోపు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News August 23, 2025
జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ కేడేట్ల ఎంపిక

జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆర్మీ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కేడెట్ల ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎత్తు, బరువు కొలతలతో పాటు పరుగు పందెం, పుష్ అప్స్, వైద్య, రాత పరీక్షలు నిర్వహించారు. పేర్కొన్న పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులను కేడేట్లుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ అధికారులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.
News August 23, 2025
శంకరపట్నం: పశువుల పండుగ రోజే పశువుల చోరీ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో పశువుల పండుగ రోజైన శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు పశువులను ఎత్తుకెళ్లారు. బావి దగ్గరి పశువుల పాకల వద్ద ఈ చోరీ జరిగింది. బాధిత రైతులు దుఃఖంతో కన్నీటిపర్యంతమై, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.