News August 23, 2025
త్వరలో MHలో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ?

ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రంలోని హైవేలపై టోల్ ఛార్జీలను మహారాష్ట్ర ప్రభుత్వం మినహాయించనుంది. ఇప్పటికే అటల్ సేతు, పుణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లపై ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కాలుష్యం తగ్గించడం, EVల కొనుగోలు ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News August 23, 2025
ఐబీలో 394 జాబ్స్.. జీతం రూ.81వేలు

394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్లకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <
News August 23, 2025
యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలి’ అని తెలిపారు.
News August 23, 2025
రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.