News August 23, 2025

KNRలో రేపు జిల్లాస్థాయి యోగాసన పోటీలు

image

జూనియర్ విభాగాల్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు రేపు నిర్వహించనున్నట్లు TG యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ KNR యూనిట్ కన్వీనర్ ఎం.రమేష్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని SEPలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ట్రెడిషనల్ యోగా, ఫార్వర్డ్ బైండ్, బ్యాక్ బెండ్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు శనివారం సా.6 గం.లోపు 8522920561ను సంప్రదించాలన్నారు.

Similar News

News August 24, 2025

గర్షకుర్తిలో రూ.70 లక్షల అప్పు చేసి వ్యాపారి పరారీ

image

గంగాధర(M) గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్‌టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకు పైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News August 24, 2025

చొప్పదండి: అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

image

వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మండపం వద్ద లైవ్ విద్యుత్ కనెక్షన్లను పరిశీలించాలని, మండపంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రి ప్రమాదాల నివారణకు ఎస్‌ఎఫ్‌ఓ 8712699247,8712699246 సెల్ నంబర్లతో టచ్‌లో ఉండాలని కోరారు.

News August 23, 2025

KNR: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీనివాస్

image

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నియామక మయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి లో నిర్వహించిన CPI 4వ రాష్ట్ర మహాసభల్లో పార్టీ శ్రేణులు ఆయనకు నియామక ఉత్తర్వులు అందించారు. తన నియామకానికి సహకరించిన సీనియర్ నాయకులు, పార్టీ నేతలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారాని కోసం పోరాటాలు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.