News August 23, 2025

పాదయాత్రను విజయవంతం చేయాలి: మంత్రి

image

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించబోయే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, మక్కన్ సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Similar News

News March 11, 2026

భర్తతో విడాకులు.. భరణం ఆశించని హన్సిక

image

ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా భర్త సోహైల్ నుంచి <<19354762>>డివోర్స్<<>> తీసుకున్న హీరోయిన్ హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు. మనస్పర్ధల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

News March 11, 2026

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: PDPL కలెక్టర్

image

జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేశామని, నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఆయన రంగాపూర్ లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకా ఎవరైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే విచారించి జారీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 6,80,000 మందికి ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుందని తెలిపారు.

News March 11, 2026

నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

image

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.