News August 23, 2025
ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి: బొప్పరాజు

AP: ఉద్యోగులకు సంబంధించి ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి. 3 నెలల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Similar News
News August 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 24, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.36 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 24, 2025
ఆ బిల్లుకు PM అతీతం కాకూడదన్నారు: కిరణ్ రిజుజు

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు PM అతీతం కాకూడదని మోదీ చెప్పినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ‘బిల్లు నుంచి ప్రధానికి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మోదీ క్యాబినెట్‌కు చెప్పారు. ప్రధాని కూడా ఒక పౌరుడేనని, ఆయనకు ప్రత్యేక రక్షణ అవసరంలేదని చెప్పారు. అత్యధిక సీఎంలు మన పార్టీ వాళ్లే ఉన్నారని, వాళ్లు తప్పు చేస్తే పదవిని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు.
News August 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.