News April 2, 2024

గిద్దలూరు: జనసేన పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్‌ఛార్జ్‌గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News July 8, 2024

చీరాల: ఆడపిల్లలు పుట్టారని.. ఇంటి నుంచి గెంటేశారు

image

చీరాల కొత్తపాలేనికి చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టగా, కుసుమాంజలి గర్భవతిగా ఉన్న సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుసుమాంజలికి రెండో కాన్పులో ఆడ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అత్తా, మామ, మరిది ఇంట్లోకి రానివ్వలేదని అత్తింటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. కుసుమ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 8, 2024

ప్రకాశం జిల్లాలో టన్ను ఇసుక ధర రూ.247

image

ప్రకాశం జిల్లాలోని మూడు ప్రదేశాలలో సుమారు 42,833 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం టన్ను ఇసుక ధర రూ.247గా కలెక్టర్ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌, సతుకుపాడు డంప్‌-1, డంప్‌-2లో రూ.247 చెల్లించి సొంత వాహనాలలో ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు.

News July 7, 2024

ఒంగోలు: 11న ఐటీఐ విద్యార్థులకు జాబ్ మేళా

image

ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్‌ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్‌ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.