News August 23, 2025
ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి: ఏఎస్పీ

స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
Similar News
News August 24, 2025
ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి: ఎస్పీ

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వెల్లడించారు. గణేశ్ మండపాలకు, ఊరేగింపులకు సింగిల్ విండో విధానంలో నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఒకరిని కాపలా ఉంచాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపరీతమైన డీజే సౌండ్‌లను అనుమతించబోమని పేర్కొన్నారు.
News August 23, 2025
లావణ్యకు కర్నూలు జిల్లా మొదటి ర్యాంక్

తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన బొల్లుం లావణ్య డీఎస్సీ మెరిట్ లిస్టులో 94.53202 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి టీచర్ ఉద్యోగం పొందారు. ఇష్టపడి చదివిన ఫలితమే ఈ విజయమని లావణ్య అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, గ్రామస్థులు ఆమె ప్రతిభను కొనియాడి అభినందించారు.
News August 23, 2025
ఒకే ఊరిలో 8 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

కౌతాళం మం. నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ కేటగిరిలో వడ్డే నాగరాజు కన్నడ సబ్జెక్ట్‌లో కర్నూలు జిల్లా రెండో ర్యాంక్, తాలూరు స్వాతి సోషల్‌లో జిల్లా ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టి.మంజుశ్రీ మ్యాథ్స్‌లో రాణించారు. అలాగే SGT విభాగంలో కె.కావ్య జిల్లా మూడో ర్యాంక్ సాధించారు. రణ్ రాజ్, రాంతుల్ల, విజయ కుమార్, వైశాఖ శెట్టి సైతం ఉద్యోగాలు పొందారు.