News April 2, 2024
విజయవాడ: ‘ఆ వాహనాలకు ఈ దారిలో అనుమతి లేదు’

విజయవాడ నగరంలో తిరిగే టిప్పర్ వాహనాల యజమానులతో పోలీస్ అధికారులు సోమవారం KS వ్యాస్ భవనంలో సమావేశమయ్యారు. గ్రావెల్ మొదలైన మెటీరియల్‌ను రవాణా చేసే టిప్పర్లు, కనకదుర్గ వారధి మీదుగా వారధి వైపునకు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. టిప్పర్లు గొల్లపూడి వై జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లాలన్నారు. టిప్పర్లపై టార్పాలిన్ కప్పి మెటీరియల్ రవాణా చేయాలని పోలీసులు టిప్పర్ల యజమానులను ఆదేశించారు.
Similar News
News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.
News March 13, 2026
‘పది’ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లలో మొత్తం 411 పరీక్షా కేంద్రాల్లో 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు.
News March 12, 2026
కృష్ణా జిల్లాకు 74.8 కోట్లు మంజూరు

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం కృష్ణా జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 1.33 లక్షల మంది రైతులకు రూ.74.8 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.


