News August 23, 2025

HYD: ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్

image

HYD మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కోర్సుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ లర్నింగ్ అండర్ UG, PG, డిప్లమా సర్టిఫికెట్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News March 20, 2026

‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి’

image

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఉద్ధృతమవుతోంది.. భూ నిర్వాసితులు, స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సభలు, తీర్మానాల ద్వారా రైల్వే శాఖకు విజ్ఞప్తులు పంపిస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మహా దీక్షలు నిర్వహించగా, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2026

గల్ఫ్‌కు US ₹1.5 లక్షల కోట్ల ఆయుధాలు

image

UAE, కువైట్‌కు దాదాపు ₹1.5 లక్షల కోట్ల మిలిటరీ సేల్స్‌కు US ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మిస్సైల్, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌, మిస్సైల్స్, F-16 యుద్ధ విమానం కోసం వివిధ రకాల ఆయుధాలను అమ్మనుంది. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ ఈ 2 దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఆయిల్, గ్యాస్‌ ఫీల్డ్‌లూ లక్ష్యంగా మారుతున్నాయి.

News March 20, 2026

NZB: అసెంబ్లీలో అంకాపూర్ గురించి ప్రస్తావించిన CM

image

NZB జిల్లాలోని ఆదర్శ గ్రామం అంకాపూర్ గొప్పదనం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అలనాడు ఒకేసారి వందల సంఖ్యలో కార్లు కొన్న ఘటన నుంచి వాణిజ్య పంటలను పండించడంలో రైతుల పరిణితితో పాటు గ్రామ విశిష్టతను పేర్కొన్నారు. అలాగే అంకాపూర్ దేశీ చికెన్ గురించి ప్రస్తావిస్తూ ఆర్మూర్ MLA రాకేశ్ రెడ్డి ఒకరోజు అసెంబ్లీలో ఆ చికెన్ రుచి సభ్యులకు చూపాలని కోరారు.