News August 23, 2025

ఖమ్మం: విషాదం.. పంట పొలంలో రైతు మృతి

image

కూసుమంచి మండలం పాలేరుకు చెందిన రైతు ఎడవల్లి వీరభద్రారెడ్డి(50) తన పంటపొలంలో మృతి చెందాడు. పొలం గట్టు పక్కన కిందపడి ఉన్న వీరభద్రారెడ్డిని గమనించిన పక్క పొలాల రైతులు దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే ఆయన చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 25, 2026

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

image

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.

News March 25, 2026

హుజూర్‌నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

image

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.