News April 2, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

AP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సెట్-2024, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు 5 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Similar News

News March 15, 2026

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

image

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.

News March 15, 2026

పిల్లలకు ఈ పోషకాలు తప్పక ఇవ్వండి

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News March 15, 2026

రేపటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’

image

AP: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిటెక్, డీప్‌టెక్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, ఎల్‌నినో నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. ఈ నెల 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.