News August 23, 2025

విశాఖ ఉక్కుపై సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదు

image

మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలుకు ప్రైవేటు టెండర్లు పిలిచారని వెంటనే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు భీమవరం సీపీఎం ఆఫీసు‌లో జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాదని మేం కాపాడుతామని చెప్పిన పెద్దలు నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.

Similar News

News August 24, 2025

పాలకోడేరు పీహెచ్సీనలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

image

పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవం అయిన మహిళను ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ గులాం రాజ్ కుమార్, స్వర్ణ నిరంజని ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

News August 24, 2025

క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

image

పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులతో శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు హైకోర్టు జడ్జిను శాలువాతో సత్కరించి శ్రీ స్వామి వారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లు ప్రిన్సిపల్, సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్ పాల్గొన్నారు.

News August 23, 2025

డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పెదఅమీరం యువకుడు

image

ఇటీవల విడుదలైన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో కాళ్ల మండలం పెదఅమీరంకు చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ ర్యాంక్, జోన్ 2 స్థాయి (3జిల్లాలు కలిపి) ఉద్యోగాలైన టీజీటీ మ్యాథ్స్‌లో 6వ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్‌లో 24వ ర్యాంక్, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ పోస్ట్‌కు గాను 56వ ర్యాంక్ సాధించాడు.