News August 23, 2025

అనకాపల్లి: చీపురు పట్టి శుభ్రం చేసిన ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వ్యర్ధాలను తొలగించారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రతతో అంటూ వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2026

జీవీఎంసీ వార్డుల విభజన ప్రారంభం

image

విశాఖలో జీవీఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 98 వార్డులను 120కి పెంచుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ మొదలైంది. ఈనెల 9లోగా ప్రక్రియ పూర్తి చేసి, మే 5లోగా గెజిట్ విడుదల చేయనున్నారు. ఒక్కో వార్డుకు సగటున 15,840 జనాభా ఉండగా, 10% వరకు అటూ ఇటూగా మార్పులకు అవకాశం ఉంది. ప్రజల అభ్యంతరాల తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఆమోదం పొందనుంది. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంది.

News April 2, 2026

ఆదిలాబాద్: ​కోరం లేకుంటే గ్రామసభ రద్దు..!

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు నిర్వహించే గ్రామసభలు చట్టబద్ధంగా చెల్లాలంటే ‘కోరం’ అత్యంత ముఖ్యం. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, గ్రామంలోని మొత్తం ఓటర్లలో కనీసం 10 శాతం మంది లేదా 50 మంది (ఏది తక్కువైతే అది) తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ ఈ కనీస సంఖ్య లేకపోతే, ఆ సభను నిర్వహించే అధికారం ఉండదు, దానిని రద్దు చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి పనుల ఆమోదం, హామీ నిధుల కేటాయింపు వంటివి ఈ సభలోనే నిర్ణయిస్తారు.

News April 2, 2026

వరంగల్: మొదలు కాని ఇందిరమ్మ ఇళ్ల సంగతేంది?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 12 నియోజకవర్గాలకు 42,727 ఇళ్లు మంజూరు కాగా, నిధుల విడుదలపై ఉన్న సందిగ్ధతతో లబ్ధిదారులు ముందుకు రావట్లేదు. మొత్తం 42,627 ఇళ్లలో ప్రస్తుతం 29,069 నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, కేవలం 2,282 మాత్రమే పూర్తి దశకు చేరుకున్నాయి. 11,276 ఇళ్లు ఇంకా ముగ్గు కూడా పోయని దశలో ఉండగా, వాటి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పేదలు కోరుతున్నారు.