News August 23, 2025

GNT: మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు

image

పనితీరు, ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. 1 స్థానంలో నిమ్మల రామానాయుడు, 2 స్థానంలో నారా లోకేశ్, 3 స్థానంలో సత్యకుమార్ యాదవ్, 4 స్థానంలో అనిత, 5 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మొదటి ఐదు స్థానాలలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండటంతో గుంటూరు జిల్లా అత్యుత్తమ స్థానంలో స్థానంలో నిలిచింది.

Similar News

News March 13, 2026

పంట రుణాల పరిమితి ఖరారు

image

TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ FY2026-27కి గాను పంట రుణాల పరిమితిని ఖరారు చేసింది. ఎకరా వరి సాధారణ సాగుకు ₹48,000, SRIకి ₹38K, విత్తనోత్పత్తికి ₹51K, పత్తి(నీటి వసతి) ₹52K, వర్షాధారం ₹50K, విత్తనోత్పత్తికి ₹1.50Lగా నిర్ణయించింది. మిరప(సాధారణ సాగు) ₹90K, మల్చింగ్ ₹లక్ష, మొక్కజొన్న(₹38K, ₹32K, స్వీట్‌కార్న్ ₹43K), కంది(₹27K, ₹23K, ₹25K), పసుపు ₹92K, టమాటా ₹58K, ఉల్లి ₹49K, పెసలు (₹20K, ₹22K)గా ఉంది.

News March 13, 2026

VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

image

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్‌-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్‌కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్‌ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 13, 2026

జలుమూరులో అగ్ని ప్రమాదం

image

జలుమూరు మండలం నామాలపేటలో గురువారం సాయంత్రం జీడీ, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామ రైతులు ఎన్.భాస్కరరావు, ఎన్.లక్ష్మీనారాయణ, సీహెచ్ రత్నాలు, రమేశ్‌లకు చెందిన నాలుగు ఎకరాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు ఆస్తి నష్టం రూ.50వేల వరకు ఉంటుందని సిబ్బంది అంచనా వేశారు.