News August 23, 2025
HYD: 39,161మంది కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు.!

HYDతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కంపోస్ట్ ఎరువు తయారీపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 81 రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 39,161మంది తమ ఇళ్ల వద్దే కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారని మున్సిపల్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
Similar News
News March 8, 2026
HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.
News March 8, 2026
HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.