News August 23, 2025

మీసేవ కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

image

మీసేవ కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. వికారాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజలను మోసం చేసి.. డబ్బుల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News March 13, 2026

అమరావతిలో NTPC కార్యాలయానికి లీజ్ ఒప్పందం

image

అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ NTPC లిమిటెడ్‌తో ఏపీసీఆర్‌డీఏ లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీసీఆర్‌డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ జుబిన్ చెరన్ రాయ్, NTPC తరఫున కుందారం పవన్ కుమార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాజధాని ప్రాంతంలో సంస్థాగత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.

News March 13, 2026

ఈనెల 14న జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్: శ్రీదేవి

image

ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 14వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులు, న్యాయవాదులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, రాజీ చేయబడతాయన్నారు.

News March 13, 2026

జగిత్యాల రైతులకు ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్ర

image

జగిత్యాల జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 150 మంది ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులను సిద్ధిపేట జిల్లా అక్కనపల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలు, నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కోత విధానం గురించి అవగాహన కల్పించారు.