News August 23, 2025
రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం భూమిని సిద్ధంగా పెట్టుకోవాలి: కలెక్టర్

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ పరిధిలో అనంతపురం -తాడిపత్రి జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1,390లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 24, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు అనంతపురం ఎస్పీ కీలక సూచనలు

సివిల్, APSP కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్పీ జగదీశ్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 25న జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో పాటు జతపరచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు.
News August 24, 2025
అనంతపురం JNTUకు ఆరు ISO సర్టిఫికెట్లు

అనంతపురం జేఎన్టీయూ ఆరు ISO సర్టిఫికెట్లు అందుకుంది. ఈ మేరకు శనివారం ISO బృంద సభ్యులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావుకు అందజేశారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూనివర్సిటీని మరింత మెరుగైన ప్రమాణాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
News August 23, 2025
పోలీస్ నుంచి టీచర్‌గా..

మెగా డీఎస్సీ ఫలితాల్లో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మం. జూటూరుకు చెందిన వసుంధర సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 59వ ర్యాంకుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి (SGT)గా ఎంపికయ్యారు. అయితే వసుంధర ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో పనిచేశారు. ప్రజల రక్షణలో కీలకంగా పనిచేస్తూ లక్ష్యాన్ని మరవకుండా టీచర్ జాబ్ సాధించారు.