News August 23, 2025

నరసరావుపేట: పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్యం సాటిలేనిదని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అనంతమని, ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 18, 2026

శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు

image

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం..
◆ ఉ.8 గంటల నుంచి చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమం
◆ సా.5 గంటల నుంచి సాయంకాలార్చనలు, నిత్యహవనాలు,రుద్రహోమం
◆ సా.5:30 గంటలకు ప్రభోత్సవం
◆ రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, కల్యాణ మహోత్సవం, ఏకాంతసేవ
◆ వీరాచార విన్యాసములు, అగ్నిగుండ ప్రవేశం

News March 18, 2026

ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

image

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.

News March 18, 2026

ఖమ్మం: ‘వనజీవి రామయ్య’కు గద్దర్ అవార్డు

image

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం HYD ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ్‌లు చిత్రబృందాన్ని అభినందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.