News August 23, 2025

మీకు తెలుసా..?.. GHMC అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఇదే..!

image

గ్రేటర్ HYD కోసం GHMC ఎలా పనిచేస్తుందో తెలుసా..? జీహెచ్ఎంసీకి ప్రజాప్రతినిధులైన మేయర్, డిప్యూటీ మేయర్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకునే కమిషనర్, ఇంజినీరింగ్, శానిటేషన్, హెల్త్ వంటి డిపార్ట్‌మెంట్లు చూసుకునేందుకు అడిషనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లు, ఒక్కో జోన్లో ఒక్కో జోనల్ కమిషనర్, 30 సర్కిల్స్, ఒక్కో సర్కిల్ చూసుకునేందుకు డిప్యూటీ కమిషనర్, మరోవైపు జాయింట్ కమిషనర్లతో నడుస్తోంది.

Similar News

News March 28, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

image

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

News March 28, 2026

నాగార్జునసాగర్ తీరంలో అంతర్జాతీయ సదస్సు!

image

నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు శనివారం సందర్శించనున్నారు. బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వీరు ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని అధికారుల సమాచారం. ఈ సందర్శన బౌద్ధ సాంస్కృతిక పరస్పర మార్పిడి, ప్రచారం, పరిశోధనలకు కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

News March 28, 2026

పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.