News August 23, 2025

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు

image

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శుక్రవారం తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 2 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 12.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 75 నుంచి 82 శాతం ఉంటుందన్నారు.

Similar News

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 13, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

image

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

News March 13, 2026

అల్లూరి: 4 మండలాల్లో 100 శాతం పన్నుల వసూళ్లు

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 4 మండలాల్లో 100శాతం ఇంటి పన్నులు వసూలు జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. కొయ్యురు, హుకుంపేట, ముంచింగిపుట్టు, పోలవరం జిల్లాలో వై.రామవరం మండలాల్లో పూర్తి గా పన్నులు వసూలు అయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 430 పంచాయతీల్లో 373 పంచాయతీల్లో పన్నులు వసూళ్లు పూర్తి అయ్యిందన్నారు.