News August 23, 2025
HYD: రూ.3 వేలకే ఫోన్ అంటూ రీల్స్.. జర జాగ్రత్త!

సోషల్ మీడియా వినియోగం పెరగడంతో వ్యాపార ప్రకటనలకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలుగా మారాయి. రూ.3 వేలకే మొబైల్, రూ.10కే ఇంటర్నేషనల్ బ్రాండ్ టీషర్ట్, రూ.12 వేలకే LCD TVఅంటూ చేసే రీల్స్ చూసి గుడ్డిగా నమ్మొద్దని HYDపోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కొందరు యువత ఆ యాడ్స్‌ను నమ్మి వాటిని కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారన్నారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Similar News
News March 4, 2026
ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.
News March 4, 2026
కడప: నియోజకవర్గాల YCP పరిశీలకులు వీరే!

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు YCP పరిశీలకులను నియమించింది. వారి వివరాలు:
☞ మైదుకూరు- వాకమళ్ల రాజగోపాల్ రెడ్డి ☞ బద్వేలు- దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి
☞ కడప-సింగసాని గురుమోహన్ ☞పులివెందుల-కల్లూరి నాగేంద్రరెడ్డి ☞ కమలాపురం-రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ☞ ప్రొద్దుటూరు- పూల శ్రీనివాసులురెడ్డి ☞ జమ్మలమడుగు నియోజకవర్గానికి పోరెడ్డి నరసింహ రెడ్డిని YCP అధిష్ఠానం పార్టీ పరిశీలకులుగా నియమించింది.
News March 4, 2026
మహిళా సంఘాల రుణ లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

జిల్లాలో మహిళా సంఘాల రుణాల పంపిణీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రికవరీ తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. శ్రీనిధి రుణాల వసూళ్లలో జాప్యం లేకుండా కార్యాచరణ రూపొందించి, మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని స్పష్టం చేశారు.


