News August 23, 2025
HYD: స్క్రీన్ టైమింగ్ పెరిగితే.. కంటిపై ప్రభావం…!

మొబైల్ వాడకం పెరగడంతో రోజు రోజుకు స్క్రీన్ టైమింగ్ పెరిగి, కంటి పొర పొడిబారుతున్నట్లుగా మేడ్చల్ జిల్లా కీసర డాక్టర్ సరిత తెలిపారు. కళ్లలో ఇరిటేషన్, నొప్పి, మంటలు రావడం, నీరు లేకుండా ఉండటం, ఆకారంలో చిన్నవిగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, మెల్లగా దృష్టి మసకబారుతుందన్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లుపైకి కిందకి అనడంతోపాటు దూర ప్రాంతాన్ని చూడాలని, రోజు 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు.
Similar News
News March 16, 2026
నోటీసుల డ్రామా వద్దు.. MPతో రాజీనామా చేయించండి: YCP

AP: డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన MP మహేశ్‌కు బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని CM CBNపై YCP ధ్వజమెత్తింది. ‘మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి MLAలు శ్రీధర్, ఆదిమూలం, రవికుమార్, అహ్మద్, మంత్రి సంధ్యారాణి PAపై చర్యలు లేవు. ఫొటోలతో అడ్డంగా దొరికిన TTD ఛైర్మన్‌పైనా నో యాక్షన్. MPతో రాజీనామా చేయించి అందరిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజలు క్షమించరు’ అని పేర్కొంది.
News March 16, 2026
వినతులను స్వీకరించిన ఏలూరు ఎస్పీ

ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. SP ప్రతాప్ శివ కిషోర్
ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా అర్జీదారుల నుంచి 46 ఫిర్యాదులు సేకరించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులు https://meekosam.ap.gov.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
News March 16, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు చేయరాదన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.


