News August 23, 2025

HYD: వినాయక చవితి.. పోలీసుల సూచనలు

image

గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.

Similar News

News March 27, 2026

మన్యంకొండలో వైభవంగా సీతారాముల కళ్యాణం

image

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రేపు ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

News March 27, 2026

అల్లూరి: ఈతకు వెళ్లి బాలుడు మృతి

image

హుకుంపేట(M) కామ్మయ్య పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాంగి సాకేత్(8) స్నేహితులతో ఆడకుంటూ తీగలవలస పంచాయతీ, రాతులపుట్టు గెడ్డలో ఈత వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసినా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News March 27, 2026

ప.గో: వీరి ప్రేమ విషాదాంతం

image

SMలో పరిచయమైన యువకుడు, వివాహిత ప్రేమ కథ విషాదాంతమైంది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వాసి మావుళ్లయ్య (25)కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత రమ (35)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించగా ఇంట్లో చెప్పకుండా గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు తమ ప్రేమకు అంగీకరించరని చేబ్రోలు వద్ద ఉన్న గోదావరి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.