News August 23, 2025

HYD: 24/7 హైడ్రా చర్యలు.. స్పెషల్ REPORT

image

వర్షాకాలం ముందు నుంచే HYDలో పూడిక తొలగింపు పనులు జరగగా జులై 1 నుంచి పనుల్లో హైడ్రా వేగం పెంచింది. ఇప్పటి వరకు 15,665 క్యాచ్‌పిట్లు, 359 కల్వర్టులను సిబ్బంది శుభ్రపరిచారు. 1,670 నాలాల్లో చెత్తను తొలగించారు. 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసి, వర్షాకాలంలో 4,974 ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. మొత్తంగా జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులు పూర్తి చేశారు.

Similar News

News August 24, 2025

రాహుల్‌కు, కాంగ్రెస్‌కు బిహార్‌లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్‌లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్‌లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.

News August 24, 2025

తాంసిలో వైభవంగా ఎద్దుల జాతర.. హాజరైన కలెక్టర్, ఎస్పీ

image

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

News August 24, 2025

మెదక్: ‘ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి’

image

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ ఫోన్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసిన ఫిర్యాదులు, సూచనల మేరకు పని చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఆమె పేర్కొన్నారు.