News August 23, 2025
HYD: ప్రారంభానికి సిద్ధంగా 15 తాగునీటి రిజర్వాయర్లు..!

జలమండలి పరిధిలో మరో 15 తాగునీటి రిజర్వాయర్లు అందుబాటులోకి రానున్నాయి. ORR ఫేజ్-2 కార్యక్రమంలో భాగంగా 2,761 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సర్వీస్ రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. గుర్రంగూడ, విశాఖనగర్, సుల్తాన్‌పూర్, బోదిగుట్ట, గంధంగూడ, ఉస్మాన్‌సాగర్, కృష్ణ బృందావన్ కాలనీ తదితర చోట్ల వీటిని త్వరలో ప్రారంభిస్తారు.
Similar News
News March 18, 2026
గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలపై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ

గ్రామీణ డాక్ సేవక్‌ల పని ప్రదేశాల్లో స్థితిగతులపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్‌లో మాట్లాడారు. వెనకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచే ప్రక్రియ చేసిందా, ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులు నింపడం, మౌళిక వసతుల పెంపు, డిజిటల్ ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు పెంచి పోస్టల్ సర్వీస్‌ను మెరుగుపరిచే కార్యక్రమం చేసిందా అని అడిగారు. ఆయన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
News March 18, 2026
డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.
News March 18, 2026
విశాఖ: మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్

నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్టల్ గార్డ్ కాపాడింది. విశాఖకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 300 కి.మీ.ల దూరలో బోటు మరమ్మతులకు గురైంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్‌పాండర్ సాయంతో అధికారులను కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమాచారం మేరకు కోస్ట్ గార్డులు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడారు.


