News April 2, 2024

కామారెడ్డి: అక్కడ మహిళలే నిర్ణేతలు..!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మొత్తం 16,31,996 ఓట్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,98,220, మహిళలు 8,33,718, ట్రాన్స్‌జెండర్లు 58 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారి పోలింగ్ శాతమే అధికం. కాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓటర్లపైనే ఆధారపడి ఉంది.

Similar News

News March 21, 2026

ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

image

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం

News March 21, 2026

నిజామాబాద్: కొండెక్కిన ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండల తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.325 పలుకుతుండగా, డ్రెస్డ్ చికెన్ రూ.286-290 మధ్య ఉంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని గత నెలతో పోలిస్తే కిలోపై రూ.80 వరకు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

News March 21, 2026

NZB: మాయమవుతున్న అడవి.. మంటగలుస్తున్న ప్రకృతి!

image

​నిజామాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గుతోంది. గత రెండు దశాబ్దాల్లో సుమారు 580 హెక్టార్ల అటవీ సంపద హరించుకుపోయింది. ముఖ్యంగా అటవీ అంచున ఉన్న గ్రామాల్లో ‘పోడు సాగు’ పెరగడం వల్ల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వందల ఎకరాల అటవీ భూమి సాగు భూమిగా మారుతోంది. అటవీ అధికారులు నిఘా పెంచినప్పటికీ, పోడు సాగును అరికట్టడం సవాలుగా మారింది.

# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం