News August 23, 2025
మేడ్చల్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలు ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. శనివారం నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, డీసీపీ కోటిరెడ్డితో కలిసి శామీర్‌పేట్ చెరువును సందర్శించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.
News March 12, 2026
జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
News March 12, 2026
GWL: పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163.. ఎస్పీ శ్రీనివాసరావు

ఈనెల13 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి గూడాటాన్ని నిషేధించామన్నారు. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.


