News August 23, 2025
HYD: ఈ రూట్‌లో మారథాన్.. ఆల్టర్నేట్ రోడ్లలో వెళ్లండి..!

‘HYD మారథాన్’ ఆదివారం ఉ.5 గంటల నుంచి ఉ.11:30 వరకు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ఈరోజు తెలిపారు. 42K / 21K ఈవెంట్ పీపుల్‌ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు,10K రన్ ఈవెంట్ హైటెక్ గ్రౌండ్స్, మాదాపూర్, క్యుములేషన్ గచ్చిబౌలి స్టేడియం రూట్లలో జరుగుతాయన్నారు. పలు రోడ్లు మూసి ఉంటాయని ORR, రోలింగ్ హిల్స్, IKEA ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ వంతెన, మాదాపూర్ రోడ్డు ఆల్టర్నేట్ రూట్లని తెలిపారు.
Similar News
News April 8, 2026
HYD: పోలీసుల చేతికి హైటెక్ కెమెరాలు!

HYDలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌కు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. నగరవ్యాప్తంగా నిఘాను పటిష్ఠం చేస్తూ 300 అధునాతన డిజిటల్ కెమెరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 12 మెగాపిక్సెల్ సామర్థ్యం, నైట్ మోడ్, GPS ట్యాగింగ్ వంటి అత్యాధునిక హంగులతో కూడిన ఈ కెమెరాల కోసం ప్రభుత్వం వేట మొదలుపెట్టింది. పారదర్శకత పెంచేందుకు, సాక్ష్యాధారాల సేకరణను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News April 8, 2026
బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై అత్యాచారం

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పైలట్ శిక్షణ సంస్థలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణ పొందుతున్న యువతిపై ఇన్‌స్ట్రక్టర్ నసీముద్దీన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని లొంగదీసుకొని, అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 8, 2026
స్టేట్ INCOME.. మన HYD నుంచే అధికం..!

రాష్ట్రానికి అధిక ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి నుంచే సమకూరుతోంది. 2025-26లో దాదాపు 80% రాబడి(రూ.78,706CR)తో HYD, RR, MDCL, సంగారెడ్డి(D) టాప్‌లో నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు, కంపెనీలుండటం ఇందుకు ముఖ్యకారణం. ఇక నారాయణపేట, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్(D)లు 1-2%తో వెనుకంజలో ఉన్నాయి. ఈ జిల్లాలు వ్యవసాయంపైనే ఆధారపడటం, తయారీ యూనిట్లు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇన్‌కంలో చెప్పుకోదగ్గ స్థానాల్లో లేవు.


