News August 23, 2025

ఏ. కొండూరు: డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ఇతనే

image

ఏ. కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భూక్యా జాన్సన్ డీఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఎస్‌జీటీ కేటగిరీలో 100 మార్కులకు 95 మార్కులు సాధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు. జాన్సన్ సాధించిన ఈ విజయం పట్ల అతని తల్లిదండ్రులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Similar News

News March 12, 2026

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

image

కాలిఫోర్నియాపై ఇరాన్ డ్రోన్ దాడి చేసే అవకాశం ఉందని అక్కడి పోలీసులను FBI అలర్ట్ చేసినట్లు ABC న్యూస్ పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఈ వార్నింగ్స్ ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందనే సమాచారం మాత్రం తమ దగ్గర లేదని FBI పేర్కొంది. అయితే ఇరాన్ యుద్ధ నౌకలు ధ్వంసమైన నేపథ్యంలో ఆ దేశ డ్రోన్లు ఇప్పుడు అంతదూరం చేరుకునే అవకాశం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

News March 12, 2026

వరంగల్: 19 రోజులే గడువు.. రూ.111.95 కోట్ల టార్గెట్

image

ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 19 రోజులే గడువు మిగిలి ఉంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. 2025-26 ఆస్తి పన్ను రూ.81.58 కోట్లు ఉండగా, పాత బకాయితో కలిపి మొత్తం రూ.178.19 కోట్లు ఉంది. ఈ ఏడాది రూ.178.19 కోట్ల బకాయిలలో ఇప్పటి వరకు రూ.66.24 కోట్లు వసూలు చేయగా, రూ.111.95 కోట్ల బకాయి ఉంది. మరో 19 రోజులే గడువు ఉండటంతో, రోజుకు రూ.6 కోట్లు వసూలు చేస్తేనే బకాయి పూర్తవుతుంది.

News March 12, 2026

MBNR: మినీ ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు..!

image

‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ (₹39.82 కోట్లు), జడ్చర్ల (₹36.67 కోట్లు), గద్వాల (₹42.82 కోట్లు), జోగులాంబ (₹6.7 కోట్లు) నిధులతో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.