News August 23, 2025

HYD: రేపు ఉదయం ఈ రూట్లు బంద్..!

image

HYDలో ఆదివారం ఉ.5 గంటల నుంచి పలు రూట్లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ (7:15 AM వరకు), ఇందిరానగర్ HCU గేట్ నంబర్-2 (11:30 AM వరకు), లెమన్ ట్రీ నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), IKEA నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), రోడ్ నంబర్ 45 వంతెన నుంచి కేబుల్ బ్రిడ్జి (8:30 AM వరకు) రూట్లు మూసి ఉంటాయి. SHARE IT

Similar News

News March 18, 2026

సమస్యలను అధికారులకు చెప్పండి: కలెక్టర్ అనురాగ్ జయంతి

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో రైతు వేదికను కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలైనా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

News March 18, 2026

భద్రాద్రిలో నాటి రామ-లక్ష్మణుల వంటకు సజీవ సాక్ష్యాలు

image

భద్రాద్రి రామయ్యను దర్శించుకునే భక్తులను అంబసత్రంలోని పురాతన ఇత్తడి గుండిగలు(ఒక్కొక్కటి 25 KGలు) విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 150 ఏళ్ల క్రితం రామభక్తుడు పనిఘంటం వెంకటరమణ హరిదాసు ఇక్కడ నిత్య అన్నదానం చేసేవారు. ఒకానొక శ్రీరామనవమికి భక్తులు పోటెత్తగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ పెద్ద గుండిగల్లో వంట చేసి వెళ్లారని, వారే సాక్షాత్తు రామలక్ష్మణులని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News March 18, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

image

TG: మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని KTR మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. అయితే BRSకు మూసీ ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే వారికి లేదన్నారు.