News August 23, 2025
vkb: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పోక్సో కేసులపై, ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2026
WGL: పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతి

ఆడుకుంటూ ఉన్న చిన్నారిని కాలనాగు కాటేయడంతో ఓ కుటుంబంలో తీరని శోకం నిండింది. నెక్కొండ మండలం భూక్యతండాకు చెందిన లావుడ్యా తిరుపతి-సుజాత దంపతుల కుమార్తె కుట్టి(3) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. పాప నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.
News March 18, 2026
అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయాలి: కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డ్రగ్స్ మాత్రమే కాకుండా మద్యం పరీక్షలు కూడా నిర్వహించాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అధికార దుర్వినియోగంపై ఆరోపణలు చేస్తూ బోనాలపల్లి ఘటనపై విచారణ జరపాలని కోరారు.
News March 18, 2026
పాకిస్థాన్‌కు అఫ్గాన్ క్రికెటర్ బిగ్ వార్నింగ్

కాబూల్ <<19403539>>ఆస్పత్రి<<>> ఘటనపై అఫ్గాన్ యంగ్ స్పిన్నర్ ఘజన్‌ఫర్ స్పందించారు. ‘దాడిలో గాయపడిన వారి వద్ద చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేవు. సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని అఫ్గాన్ సహించదు. ప్రతిఒక్కరికీ AFG చరిత్ర తెలుసు. అది రిపీటైతే PAKకు మంచిది కాదు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమకు భారత్ మిత్ర దేశమని, దాడుల గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ దేశాలు AFGకు మద్దతుగా నిలవాలని ఘజన్‌ఫర్ కోరారు.


