News August 23, 2025
రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం: షర్మిల

AP: రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల వాపోయారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద రైతులు కి.మీ. మేర క్యూలు కడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇది నిజంగా కొరతనా, లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా అని నిలదీశారు.
Similar News
News August 24, 2025
గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడుతున్నారా?

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడితే పుట్టే బిడ్డలపై ప్రభావం చూపిస్తాయని హర్వర్డ్ పరిశోధకులు తెలిపారు. ఈ పెయిన్ కిల్లర్‌ను అతిగా వాడితే జన్యు పరమైన సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని అధ్యయనం సూచించింది. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఒక్కసారిగా మెడిసిన్ తీసుకోవడమూ ఆపకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
News August 24, 2025
కూలీ, వార్-2 కలెక్షన్లు ఎంతంటే?

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ వరల్డ్ వైడ్‌గా రూ.314 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News August 24, 2025
100 దేశాలకు భారత్ నుంచి EVల ఎగుమతి: మోదీ

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.