News August 23, 2025

బాపట్లలో సెప్టెంబర్ 13న మెగా లోక్ అదాలత్

image

సెప్టెంబర్ 13న బాపట్ల జిల్లా కోర్టుల సముదాయములో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బాపట్ల మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ శ్యాంబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, యాక్సిడెంట్ కేసులు, గృహహింస, భరణం, రెవెన్యూ, బ్యాంక్ తదితర కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కావున కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 16, 2026

తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు కేడీసీసీబీ బ్యాంక్

image

కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏటా వంద కోట్ల లాభలతో ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తూ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకి ఎంపికైనట్లు సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ ఆవార్డును 17వ తేదిన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్టి విజయం అని తెలిపారు.

News March 16, 2026

మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

image

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 16, 2026

INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

image

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.