News April 2, 2024

స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా.. ఆశీర్వదించండి: పవిత్ర

image

మడకశిర నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆర్జీ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రధాన పార్టీలను చూసి చూసివిసిగిపోయారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే కుల, మత, పార్టీలకు అతీతంగా మడకశిరను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

Similar News

News March 9, 2026

అనంతపురం కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, ఇతర పరిపాలనా పరమైన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News March 9, 2026

అసాంఘిక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో సక్రమ ప్రవర్తన ఎంత ముఖ్యమో పోలీసు అధికారులు వారికి అవగాహన కల్పించారు. పాత నేరాలను వదిలిపెట్టి, బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 8, 2026

1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. అర్జీలు పరిష్కారం కాలేదా లేదా స్థితి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. ఈ నెల 9న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.