News August 23, 2025
తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.
Similar News
News March 6, 2026
నెల్లూరులో 9న ‘మహిళా జన సున్వాయి’

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
News March 6, 2026
‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ నెల్లూరు జిల్లాలో అవగాహన

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.
News March 6, 2026
వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బ్యాంకర్లకు సూచించారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఆయన నిర్వహించారు. ఖర్చులు తగ్గి వ్యవసాయం మరింత సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రోన్‌లు వంటి పరికరాల కొనుగోలుకు అన్ని బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు.


