News April 2, 2024

కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

image

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.

Similar News

News October 1, 2025

వైద్య సేవలకు ఆటంకం లేకుండా చర్యలు: కలెక్టర్

image

రాజమండ్రి: పీహెచ్‌సీలలో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు పీజీ వైద్యులు, ఇతర డాక్టర్లను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు నిరంతరాయ వైద్య సేవలు అందించేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సమన్వయంతో వైద్య ఆరోగ్య అధికారులు పని చేస్తున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

News October 1, 2025

గాడాల: దళితుడిపై దాడి ఘటనపై ఎస్పీ సీరియస్

image

కోరుకొండ మండలం గాడాలలో దళిత యువకుడిపై దాడి ఘటనలో ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. మధురపూడికి చెందిన పాముల శ్రీనివాస్ అనే వ్యక్తిపై గత రాత్రి ఇద్దరు తీవ్రంగా దాడి చేయడంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా డీఎస్పీని నియమించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ దాడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

News October 1, 2025

రాజమండ్రి: శాంతియుతంగా సమ్మె చేస్తూ పెన్షన్ల పంపిణీ

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తమ సమస్యలపై శాంతియుతంగా సమ్మె చేస్తూనే సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ దారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నట్లు సిబ్బంది తెలిపారు. పలు జిల్లాల్లో నల్ల చొక్కాలు ధరించి ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారు.