News August 23, 2025
జగిత్యాల: డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గణేష్ మండపాల వద్ద శోభాయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దాలు చేసి సౌండ్ సిస్టంలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డీజే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలనీ అధికారుల్ని ఆదేశించారు.
Similar News
News August 24, 2025
మైలవరం: 33 ఏళ్ల లీజుకు 1200 ఎకరాలు

కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1200 ఎకరాలను లీజు ప్రాతిపదికను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొడియంలో 1105.69 ఎకరాలు, వద్దిరాలలో 94.36 ఎకరాల ప్రభుత్వ భూములను 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. సోలార్ పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
News August 24, 2025
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి

దేశంలోని అత్యున్నత నాయకులలో AP CM చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు. గతంలో దేశ రాజకీయాలను అనేక సార్లు మలుపు తిప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా తమ సపోర్ట్ NDA అభ్యర్థికేనని <<17485159>>CBN<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News August 24, 2025
మహిళలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు: జితేంద్ర

షెడ్యూల్డ్ కులాల మహిళలకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి జితేంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 సంవత్సరాలలోపు GNM/B.Sc నర్సింగ్ అర్హత కలిగి వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30 లోగా jdswguntur@gmail.com మెయిల్ ఐడీలో సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలన్నారు.