News August 23, 2025
ప్రజలు పదేపదే ఓట్లు వేసి విసిగిపోతున్నారు: గోయల్

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పదేపదే ఓట్లు వేసేందుకు విసిగిపోతున్నారని, అందుకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం మంచిదన్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందంటూ ఏపీ, ఒడిశాను ఉదాహరించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదైందని గుర్తు చేశారు. ఇక ఈ విధానంతో పాలన కూడా మెరుగవుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు.
Similar News
News August 24, 2025
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి

దేశంలోని అత్యున్నత నాయకులలో AP CM చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు. గతంలో దేశ రాజకీయాలను అనేక సార్లు మలుపు తిప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా తమ సపోర్ట్ NDA అభ్యర్థికేనని <<17485159>>CBN<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News August 24, 2025
16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు

AP: డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్‌సైట్‌లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. పోస్టుకు ఒకరు చొప్పున వెరిఫికేషన్‌కు పిలవనుంది. రేపటి నుంచి జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ చూస్తోంది. వెరిఫికేషన్‌కు హాజరు కాని, సర్టిఫికెట్లు సమర్పించని వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వారికి అవకాశం కల్పిస్తారు.
News August 24, 2025
ఇక జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్స!

TG: క్యాన్సర్ మహమ్మారి చికిత్స కోసం HYDకు రాకుండా జిల్లాల్లోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోధనాస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తక్షణమే 34 మెడికల్ కాలేజీల్లో 20 పడకల(10 కీమో, 10 పాలియేటివ్ కేర్) చొప్పున కేటాయించనుంది. ఇప్పటికే 27 సెంటర్లకు కేంద్రం రూ.40.23 కోట్లు నిధులు ఇవ్వగా మరో ఏడింటిని రాష్ట్ర నిధులతో సమకూర్చనున్నారు.