News August 23, 2025
వెల్గటూర్: ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది టేకు చెట్టుకు వృద్ధుడు ఉరివేసుకొని మృతిచెందిన ఘటన వెల్గటూర్ మండలం కొండాపూర్‌లో జరిగింది. SI ఉమాసాగర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇప్పల రాజయ్య (61) గత సంవత్సరం నుండి హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో శనివారం ఉదయం తన పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News August 24, 2025
ఏపీలో రేపు అల్పపీడనం

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 26 నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులుతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో నేడు BHPL, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 24, 2025
కడప: అక్కాచెల్లెళ్లకు టీచర్ పోస్ట్‌లు

పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ మహబూబ్ నగర్‌కు చెందిన టీచర్ ఖాదర్ బాషా కుమార్తెలు DSCలో సత్తా చాటారు. ఎస్.మెహతాబ్(SGT)లో 2వ ర్యాంకు సాధించింది. S.రేష్మ 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైంది. మొహతాబ్ 2వ ర్యాంకుతో పాటు 5 ఉద్యోగాలు సాధించడం, అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ టీచర్ ఉద్యోగాలు రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News August 24, 2025
చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలి- కలెక్టర్

వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) నందు పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ అధ్యక్షతన వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు శాంతి, సామరస్య వాతావరణంలో నిర్వహించాలన్నారు. అందరూ మత సమన్వయం పాటించాలని సూచించారు.