News August 23, 2025

అఖిల్ ఒక్క రూపాయి తీసుకోలేదు: అనిల్ సుంకర

image

తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్‌గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మూవీస్ ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే, ఏజెంట్ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్‌లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

Similar News

News August 24, 2025

ఏపీలో రేపు అల్పపీడనం

image

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 26 నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులుతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో నేడు BHPL, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 24, 2025

చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి

image

దేశంలోని అత్యున్నత నాయకులలో AP CM చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు. గతంలో దేశ రాజకీయాలను అనేక సార్లు మలుపు తిప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా తమ సపోర్ట్ NDA అభ్యర్థికేనని <<17485159>>CBN<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.

News August 24, 2025

16,347 పోస్టులు.. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు

image

AP: డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఇవాళ కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్‌సైట్‌లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. పోస్టుకు ఒకరు చొప్పున వెరిఫికేషన్‌కు పిలవనుంది. రేపటి నుంచి జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ చూస్తోంది. వెరిఫికేషన్‌కు హాజరు కాని, సర్టిఫికెట్లు సమర్పించని వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వారికి అవకాశం కల్పిస్తారు.