News August 23, 2025

FLASH: యాక్సిడెంట్‌లో శంకర్‌పల్లి వాసి మృతి

image

బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి(D) కొండాపూర్ PS పరిధిలో జరిగింది. SI సోమేశ్వరి తెలిపిన వివరాలు.. శంకర్‌పల్లి మండలం గాజులగూడ వాసి కొత్తగొల్ల రాములు(50) శనివారం పొలానికి వెళ్లి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా గుంతపల్లి శివారులో వేగంగా వచ్చిన టిప్పర్‌ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News August 24, 2025

ఒడిశా గోల్డెన్ బీచ్‌లో HYD యువకుడి గల్లంతు

image

ఒడిశాలోని పూరి సముద్రంలో లంగర్‌హౌస్‌లోని జానకి నగర్‌‌కు చెందిన వికాస్‌ (24) ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. అతడి భార్య శాలిని వివరాలిలా.. కుటుంబంతో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం గోల్డెన్ బీచ్‌ వద్దకు వెళ్లాం. వికాస్ సముద్రతీరంలో అలలతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు మృతదేహం లభ్యంకాలేదని ఆమె వాపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 24, 2025

HYD: సంతాన సమస్యలు ఉన్నాయా? ఇక్కడకు వెళ్లండి

image

HYDలో సృష్టి ఘటనతో సంతాన సమస్యలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారికి వరప్రదాయానిగా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్, ప్లేట్ల బురుజు ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొండాపూర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
# SHARE IT

News August 24, 2025

HYD: ఈ ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తే ఛార్జీల్లో డిస్కౌంట్

image

పలు రకాల బస్సుల్లో ప్రయాణానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. HYD నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే లహరి NON-AC, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి AC, రాజధాని AC బస్సుల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. HYD నుంచి కడప, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, సహా అనేక ప్రాంతాలకు వెళ్లే బస్సులకు వర్తిస్తుందన్నారు.